Nalgonda: నల్లగొండలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!
Nalgonda: నల్లగొండ పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Nalgonda: నల్లగొండలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు!
Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగారిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లాను ముందంజలో నిలుపుతామని చెప్పారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా మంత్రి ప్రశంసా పత్రాలను అందజేశారు.
Next Story




