Nalgonda: మునుగోడు క్రీడా పోటీల్లో కొంపల్లి పాఠశాల ఘన విజయం!

Nalgonda: నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో కొంపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. అత్యధికంగా 32 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.

THIRUMANI SRISAILAM, MUNUGODU
Published on: 21 Sept 2026 3:07 PM IST
Nalgonda
X

Nalgonda: మునుగోడు క్రీడా పోటీల్లో కొంపల్లి పాఠశాల ఘన విజయం!

Nalgonda: మునుగోడు నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంపల్లి విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఘన విజయం సాధించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల నుంచి సుమారు 50 పాఠశాలలు పాల్గొన్న ఈ క్రీడా పోటీలలో అత్యధికంగా 32 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం గొప్ప విశేషమని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.

నియోజకవర్గ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీలలో కొంపల్లి పాఠశాల విద్యార్థులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు (ఫిజికల్ డైరెక్టర్) కున్రెడ్డి సుధాకర్ రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఐదు మండలాల నుంచి 50 పాఠశాలలు పాల్గొన్న పోటీలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైన పాఠశాలగా కొంపల్లి పాఠశాల రికార్డు సృష్టించడం పాఠశాలకే కాకుండా గ్రామానికి గర్వకారణమని విద్యార్థుల శ్రమ వారికి ఆటల్లో ఇచ్చిన తర్ఫీదు వల్లే ఈ ఫలితం సాధ్యమైదని వారు అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు జాల బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులకు చక్కని తర్ఫీదు ను ఇచ్చి మునుగోడు నియోజకవర్గ స్థాయిలో 32 మంది విద్యార్దులు ఎంపిక కావడం పట్ల వారి వెనుక ఉండి మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా చేసిన ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డిని ముందుగా అభినందించారు.అదేవిధంగా చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించి, వారి భవిష్యత్ క్రీడా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగమణి, విజయలక్ష్మి,గేర నర్సింహ,అఫీజా బేగం,సుధాకర్ రెడ్డి,స్వాతి శరత్ కుమార్, కోటయ్య, రేణుక,వెంకన్న, ధనలక్ష్మి మరియు శైలజ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

THIRUMANI SRISAILAM, MUNUGODU

THIRUMANI SRISAILAM, MUNUGODU