Kondamallepally: కొండమల్లేపల్లిలో ఘనంగా నూతన పింఛన్ల పంపిణీ

Kondamallepally: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ యుగంధర్ రెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ పత్రాలను అందజేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 17 Nov 2026 10:33 PM IST
Kondamallepally
X

Kondamallepally: కొండమల్లేపల్లిలో ఘనంగా నూతన పింఛన్ల పంపిణీ

కొండమల్లేపల్లి: నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేదలకు అందిస్తున్న పింఛన్లు వారి జీవనానికి ఎంతో తోడ్పాటుగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కొడిదాల పద్మ వెంకటయ్య, 10వ వార్డు సభ్యులు బిజిలి లింగం, పర్వతం కొండలు సాయి శంకర్ బక్కులు తదితరులు పాల్గొన్నారు. పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA