Nalgonda: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!

Nalgonda: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 26 July 2026 2:51 PM IST
Nalgonda
X

Nalgonda: ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!

నల్గొండ: నల్లగొండ జిల్లా చండూరు మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రాంత అభివృద్ధిని మరిచి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు.

నియోజకవర్గంలో అనేక ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, ఇక్కడి సమస్యలను పక్కనబెట్టి ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం సరికాదని హితవు పలికారు.​డిండి జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో మునుగోడు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని, అందువల్ల డిండి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపి సాగునీరు అందించడమే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు.​ప్రాజెక్టుకు నీరు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నీటిపారుదల శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని డిండి ప్రాజెక్టును నింపేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకుని ప్రాజెక్టుకు నీరు వచ్చేలా చూడాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story