Nalgonda: మరణంలోనూ వెలుగులు నింపిన మధుసూదన్ రావు!
Nalgonda: సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ మధుసూదన్ రావు మరణం.
Nalgonda: మరణంలోనూ వెలుగులు నింపిన మధుసూదన్ రావు!
నల్లగొండ: సీనియర్ జర్నలిస్ట్, డిప్యూటీ సీఎం సీపీఆర్ఓ మధుసూదన్ రావు భౌతికంగా దూరమైనా, మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనున్నారు. నిన్న గుండెపోటుతో కన్నుమూసిన ఆయన నేత్రాలను, కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈరోజు దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. "నా భర్త మరణం మాకు తీరని వేదన మిగిల్చినప్పటికీ, ఆయన కళ్ల ద్వారా మరో ఇద్దరు ఈ లోకాన్ని చూడబోతున్నారనే విషయం కొంత ఉపశమనాన్ని ఇస్తోంది," అని భావోద్వేగానికి లోనయ్యారు. సామాజిక బాధ్యతతో కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story




