Nalgonda: మిర్యాలగూడ విద్యాసంస్థల బంద్.. విద్యార్థి సంఘాల నిరసన

Nalgonda: మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల బంద్. ఖాళీ పోస్టుల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం నిరసన.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 10 July 2026 2:14 PM IST
Nalgonda
X

Nalgonda: మిర్యాలగూడ విద్యాసంస్థల బంద్.. విద్యార్థి సంఘాల నిరసన

నల్గొండ: రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద బంద్ నిర్వహించారు.

విద్యాసంస్థల వద్ద నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ఫీజుల భారం తగ్గించడం, స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేసే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story