Nalgonda: నల్గొండలో 60 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మండలి ఛైర్మన్!
Nalgonda: నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు ₹33,55,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
Nalgonda: నల్గొండలో 60 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మండలి ఛైర్మన్!
Nalgonda: వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 60 మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ₹33,55,500 విలువైన చెక్కులను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం అందజేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎంఆర్ఎఫ్ పథకం లక్షలాది మంది నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు.




