Maddirala: మద్దిరాల మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Maddirala: మద్దిరాల మండల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా V6 తాళ్లపల్లి శివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు.
Maddirala: మద్దిరాల మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.మండల ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్‌గా V6 న్యూస్ ఛానల్ స్టింగర్ తాళ్లపల్లి శివను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే ఉపాధ్యక్షుడిగా కట్కోజు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా తేలుకుంట్ల అంజయ్య, గౌరవ ఉపాధ్యక్షుడిగా తోణుకునూరి అశోక్ గౌడ్, గౌరవ సలహాదారుగా మురగుండ్ల వీరన్న, గౌరవ సభ్యుడిగా బండి శేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ మద్దిరాల మండలంలోని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, జర్నలిస్టుల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు.
ప్రజలకు, అధికార యంత్రాంగానికి మధ్య వారధిగా పనిచేస్తూ నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల పలువురు పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.




