Maddirala: మద్దిరాలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా విజయదశమి వేడుకలు
Maddirala: సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ఘనంగా విజయదశమి వేడుకలు. పార్వతీ రామలింగేశ్వర స్వామివారి దర్శనం, జమ్మి పూజతో అలరిన పండుగ వాతావరణం.
Maddirala: మద్దిరాలలో భక్తిశ్రద్ధలతో ఘనంగా విజయదశమి వేడుకలు
మద్దిరాల: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల మండల కేంద్రంలో విజయదశమి వేడుకలను గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పార్వతీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా జమ్మి పూజ చేసి, జమ్మి ఆకులను సేకరించారు.
అలాగే విజయదశమి పర్వదినం సందర్భంగా పాలపిట్టను దర్శించుకుని ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, గ్రామస్తులు పరస్పరం విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.




