Nalgonda: ఎంజీయూలో బంద్ విజయవంతం.. PDSU, SFI నిరసన!
Nalgonda: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో PDSU, SFI ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది.
Nalgonda: ఎంజీయూలో బంద్ విజయవంతం.. PDSU, SFI నిరసన!
Nalgonda: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి.
విద్యార్థులపై దమనకాండకు నిరసనగా పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది.
ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు..
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ... నీట్ పేపర్ లీక్ ఘటన వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమేనని విమర్శించారు.




