Nidamanoor: నిడమానూరులో ఘోర ప్రమాదం.. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి!
Nidamanoor: నల్గొండ జిల్లా నిడమానూరు మండల కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.
Nidamanoor: నిడమానూరులో ఘోర ప్రమాదం.. చేపల వేటకు వెళ్లిన వ్యక్తి కరెంట్ షాక్‌తో మృతి!
Nidamanoor: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన నిడమానూరు మండల కేంద్రం లో చోటుచేసుకుంది. నిడమానూరు చెందిన పిడుగు రాజు (40),మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాజు చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. విద్యుత్ సర్వీస్ వైరుకు తీగ తగిలించి చేపలు పడుతుండగా, ప్రమాదవశాత్తూ ఎర్త్ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రమైన షాక్‌తో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడి భార్య పిడుగు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story




