Manuguru: AIKS జాతీయ మహాసభ బహిరంగ సభ విజయవంతంపై కృతజ్ఞతలు
Manuguru: నల్గొండలో జరిగిన AIKS 36వ జాతీయ మహాసభ బహిరంగ సభను విజయవంతం చేసిన వారందరికీ సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు.
Manuguru: AIKS జాతీయ మహాసభ బహిరంగ సభ విజయవంతంపై కృతజ్ఞతలు
మణుగూరు: అఖిల భారత కిసాన్ సభ AIKS అఖిలభారత మహాసభల సందర్భంగా నవంబర్ 15వ తారీఖున నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సహకరించిన,విచ్చేసిన హాజరైన వారందరికీ సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు.
స్థానిక మణుగూరు శ్రామిక భవన్ లో పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఏ కె ఎస్ ఆల్ ఇండియా మహాసభలు జరిగినట్లు ఆయన తెలియజేశారు.
ఈ మహాసభలు నల్గొండ పట్టణంలో 15 16 17 18 తారీకుల్లో జరుగుతున్నమని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేశారని, ఈ జయప్రదానికి సహకరించిన వారందరికీ మరియు హాజరైన వారందరికీ ఈ సందర్భంగా సిపిఎం మండల కమిటీ నుంచి రైతు సంఘం మండల కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బహిరంగ సభకు మండలం నుంచి4 బస్సులు, , కార్ల ద్వారా 250 మంది హాజరైనట్లు ఆయన తెలియజేశారు.
ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో సిఐటియు మండల కన్వీనర్ కొడిశాల రాములు సర్పంచ్ కుంజా శ్రావణ్ కుమార్ వెంకట్రావు. ఉపతల నరసింహారావు , రైతు సంఘం మండల నాయకులు కుంజ రాజు బొల్లం రాజు కార్మిక సంఘం మండల అధ్యక్షులు పిట్టల నాగమణి. హేమంతరావు., గిరిజన సంఘం సంఘం మండల నాయకులు మడి నరసింహారావు గుండి భీమయ్య., డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




