Nalgonda: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం: మేయర్ తనిఖీ!

Nalgonda: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. ఆగస్టు 15న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ.

Saleem, Nalgonda
Published on: 13 Aug 2026 10:32 PM IST
Nalgonda
X

Nalgonda: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీకి సర్వం సిద్ధం: మేయర్ తనిఖీ!

నల్లగొండ: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నగరపాలక మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పరిశీలించారు. ఈనెల 15న ఎంపిక చేసిన లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

​ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మేయర్, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ లోకీ లాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్ సమద్, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story