Chilkur: తెల్లవారుజామున పెను ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో షాపులు దగ్ధం

Chilkur: సూర్యాపేట జిల్లా చిలుకూరులో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 4 May 2026 11:21 AM IST
Chilkur
X

Chilkur: తెల్లవారుజామున పెను ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో షాపులు దగ్ధం

సూర్యాపేట జిల్లా: చిలుకూరు మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక బస్టాండ్ ఆవరణలోని 'చంద్ర మీసేవ కేంద్రం'లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు పక్కనే ఉన్న ఫ్యాన్సీ మరియు కిరాణా దుకాణాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో షాపుల్లోని కంప్యూటర్లు, జిరాక్స్ యంత్రాలు, విలువైన ఫర్నిచర్ మరియు సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

​మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, వాటిని అదుపు చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే అప్పటికే భారీగా మంటలు వ్యాపించడంతో ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 35 నుంచి 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు చంద్ర కన్నీరుమున్నీరయ్యారు. తమ జీవనాధారమైన దుకాణాలు అగ్నికి ఆహుతి కావడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story