Nalgonda: నల్లగొండ దర్గా ఉత్సవాల్లో భక్తి సంగీతంతో అలరించిన మెహఫిల్ ఏ నాత్!

Nalgonda: నల్లగొండ హజ్రత్ సయ్యద్ లతీఫ్ షా వలీ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో వైభవంగా రెండో రోజు మెహఫిల్ ఏ నాత్, అన్నదాన కార్యక్రమాలు.

Saleem, Nalgonda
Published on: 3 Oct 2026 7:06 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ దర్గా ఉత్సవాల్లో భక్తి సంగీతంతో అలరించిన మెహఫిల్ ఏ నాత్!

Nalgonda: హజ్రత్‌ సయ్యద్‌ లతీఫ్‌ షా వలీ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మెహఫిల్‌-ఏ-నాత్‌, జల్సా-ఏ-అజ్మత్‌ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. హైదరాబాద్‌ బార్కాస్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించిన భక్తి గీతాలు, నాత్‌ గానాలు సభికులను ఆకట్టుకున్నాయి.

అంతకుముందు మధ్యాహ్నం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మౌలానా ఖురాన్‌ పఠనంతో పాటు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్గా ఉత్సవాల్లో సందడి చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda