Nalgonda: దామరచర్లలో దారుణం: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి!

Nalgonda: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బోత్తులపాలెంలో 54 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

Saleem, Nalgonda
Published on: 30 Aug 2026 11:07 PM IST
Nalgonda
X

Nalgonda: దామరచర్లలో దారుణం: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి!

నల్గొండ: దామరచర్ల మండలం బోత్తులపాలెంలో దారుణం వెలుగుచూసింది. ఓ మానసిక వికలాంగురాలి (54)పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి కాళ్లు, చేతులను బైండింగ్ వైర్‌తో కట్టేసి, గ్రామంలోని ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు.

​ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లికి సమీపంలోని పాడుబడ్డ భవనం నుంచి అరుపులు వినిపించడంతో వెళ్లి చూడగా ఈ విషయం బయటపడింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, తీవ్రంగా గాయపడిన బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story