Nalgonda: ఎంజీయూ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

Nalgonda: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు, రోస్టర్ విధానం పాటించలేదని విద్యార్థి సంఘాల నేతలు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

Saleem, Nalgonda
Published on: 12 Aug 2026 10:15 PM IST
Nalgonda
X

Nalgonda: ఎంజీయూ నియామకాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

నల్గొండ:​ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో చేపట్టిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ విధానం, రిజర్వేషన్లు పాటించలేదని విద్యార్థి సంఘ నాయకులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కార్యాలయంలో కమిషన్ ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు.

ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఎస్సీ, మాదిగ సామాజిక వర్గానికి చెందాల్సిన పోస్టులను ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టించారని విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ మాదిగ ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ఉల్లంఘనులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story