Nalgonda: కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: గత పాలనలో జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించి తెలంగాణకు కేసీఆర్ నష్టం చేశారని, వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Saleem, Nalgonda
Published on: 14 Sept 2026 4:01 PM IST
Nalgonda
X

Nalgonda: కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు.

​గత పాలనలో నాటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించేలా వ్యవహరించడమే నేటి పరిస్థితులకు కారణమని ఆయన ఆరోపించారు.

ఆ పాపం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తెలంగాణకు దక్కాల్సిన నీటిని తీసుకునే హక్కును, అవకాశాన్ని కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ నష్టానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ స్పందించాలని స్పష్టం చేశారు.

​మరోవైపు, నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే కీలకమైన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda