Nalgonda: తిప్పర్తిలో సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: తిప్పర్తి మండలంలో చిన్న సూరారం నుంచి పావురాలగూడెం వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
Nalgonda: తిప్పర్తిలో సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి!
Nalgonda: తిప్పర్తి మండల పరిధిలోని చిన్న సూరారం PWD రోడ్డు నుంచి పావురాలగూడెం వరకు పి.ఆర్.ఆర్ (PRR) గ్రాంట్‌తో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




