Nalgonda: నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి!
Nalgonda: నల్లగొండలోని జిల్లా క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Nalgonda: నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి!
Nalgonda: నల్లగొండ పట్టణంలోని జిల్లా క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.నియోజకవర్గం తో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, గ్రామ/పట్టణ సంబంధిత సమస్యలపై అందించిన అర్జీలను ఆయన పరిశీలించారు.
సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని జిల్లా అధికారులను స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి క్యాంపు కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.




