Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి వెల్లువెత్తిన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Nalgonda: రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నివాసంలో రాఖీలు కట్టిన మహిళా నాయకులు. మహిళా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి ప్రకటన.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 12:03 PM IST
Nalgonda
X

Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి వెల్లువెత్తిన రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

Nalgonda: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గుర్రంపోడు మాజీ ఎంపీపీ మాధవి, నారాయణపురం మాజీ జడ్పీటీసీ బుజ్జిలతో పాటు పలువురు మహిళా నాయకులు, నాయకులు మంత్రి నివాసంలో ఆయనను కలసి రాఖీలు కట్టారు.

​సహోదరత్వానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున మంత్రి వెంకటరెడ్డి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలు తనకు ఎంతో కొండంత బలమని, నియోజకవర్గ ప్రజలు, మహిళల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story