Venkat Reddy: పేపర్ లీకేజీలపై కేంద్రంపై మంత్రి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం
Venkat Reddy: కోమటిరెడ్డి వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడి, నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.
Venkat Reddy: పేపర్ లీకేజీలపై కేంద్రంపై మంత్రి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం
Venkat Reddy: దేశంలో నిర్వహించే కీలకమైన పోటీ పరీక్షల పత్రాలు వరుసగా లీక్ అవుతుండటంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో 'నీట్' (NEET)తో పాటు ఇప్పటివరకు నిర్వహించిన అనేక పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం వెనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన నల్లగొండ లో విలేకరులతో మాట్లాడుతూ... లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




