Nalgonda: నల్గొండ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా : మంత్రి!
Nalgonda: నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Nalgonda: నల్గొండ జిల్లాను అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా : మంత్రి!
Nalgonda: నీటిపారుదల, రహదారులు, వ్యవసాయం, అన్ని రంగాలలో నల్గొండ జిల్లాను అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమం ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వం రైతుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.
బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్లో జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ధాన్యం సేకరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.నల్గొండ జిల్లా అంతటికి సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే ధ్యేయమని, అందుకే ఏ ఎం ఆర్ పి కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెళ్లెముల ,ఎస్ఎల్బీసీ సొరంగం వంటివి చేపట్టినట్లు తెలిపారు.
బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న మైనర్లు, సబ్ మైనర్ల పై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా నార్కెట్పల్లి మండలం, కొండపాకోని గూడెంలో ఒక రైతుకు సంబంధించిన పొలంలో 40 మీటర్ల మేర కాలువ పనులు ఆగిపోయిన విషయం అధికారులు మంత్రికి దిష్టికి తీసుకురాగా , జిల్లా కలెక్టర్ నిదుల నుండి రైతుకు నష్టపరిహారం మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు.
కొండపాకోని గూడెం చెరువు నిండితే దోమలపల్లి చెరువు నిండుతుందని, తద్వారా ఇతర చెరువులు నింపుకునేందుకు అవకాశం ఉందని, మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు.ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్ ను అభినందించారు. నల్గొండ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని, అయితే ప్రతి సీజన్లో రైతులు వరినే పండించకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. పంట మార్పిడి పై అధికారులతో పాటు, మహిళా సంఘాలు అందరూ అవగాహన కల్పించాలన్నారు.
ఆర్ అండ్ బి రహదారులపై సమీక్ష సందర్భంగా నార్కెట్ పల్లి వద్ద ఆర్ఓబి పనులు చేపట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, మిగిలిపోయిన భూసేకరణకు సంబంధించి చెల్లింపులు చేసి పిఎన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేస్తూ పనులు వేగవంతం చేసేందుకు కలెక్టర్ వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని చెప్పారు.జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై .అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి ,పంచాయతీరాజ్ ఈ ఈ గిరిధర్ రెడ్డి,ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిచ్చయ్య, పౌర సరఫరాల డిఎం రామ్ పతి నాయక్, ఇతర అధికారులు ఉన్నారు.




