Nalgonda: రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు!
Nalgonda: తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
Nalgonda: రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు!
నల్గొండ: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
"బుద్ధికి,జ్ఞానానికి,విజయానికి అధిపతి వినాయకుడు.మనం ఏం పని ప్రారంభించినా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని మొదట గణపతిని పూజిస్తామని,ఆ లంభోధరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలు కలగి ఉండాలని, ప్రజలు ప్రారంభించే అన్ని పనుల్లో మంచి జరగాలని" మంత్రి ఆ వినాయకుడిని ప్రార్ధించారు.
"ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టిందని,రాష్ట్ర వ్యాప్తంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ఈ వినాయక చవితి నవరాత్రులు ప్రజలంతా సమిష్టిగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని" మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.




