Kodad: కోదాడలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Kodad: కోదాడలో రూ. 250 కోట్లతో నిర్మిస్తున్న గురుకుల పాఠశాలల పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 6 Sept 2026 2:49 PM IST
Kodad
X

Kodad: కోదాడలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ: రాష్ట్రంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన కోదాడ పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, నిర్మాణ పనులను పరిశీలించారు.

స్థానిక ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పట్టణంలోని బాలాజీ నగర్‌లో రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జవహర్ నవోదయ రెసిడెన్షియల్ స్కూల్, అలాగే చిలుకూరు గుట్టల్లో రూ.200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేస్తూ, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 49 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన అల్పాహార (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచడమే లక్ష్యం.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story