Suryapet: బాధితురాలుకు అండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

Suryapet: సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి ఇల్లు కోల్పోయిన వృద్ధురాలు జయమ్మ. స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 29 May 2026 4:07 PM IST
Suryapet
X

Suryapet: బాధితురాలుకు అండగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

సూర్యాపేట: జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి సర్వస్వం కోల్పోయి నిలువ నీడ లేక రోడ్డున పడ్డ ఒక వృద్ధురాలి దీనస్థితికి రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చలించిపోయారు.గాలి దుమారానికి రేకుల ఇల్లు ఎగిరిపోయి,ఆశ్రయం కోల్పోయిన ఆ బాధితురాలికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని ఆయన జిల్లా కలెక్టర్‌ తేజస్ నంద్ లాల్ పవార్ ని ఆదేశించారు.

జిల్లాలోని మట్టంపల్లి మండలం పెద్దవీడు లాల్ తండా గ్రామంలో గాలి దుమారం కారణంగా తాళ్లూరి జయమ్మ నివాసం ఉంటున్న రేకుల ఇల్లు పైకప్పు రేకులు గాలికి కొట్టుకుపోవడంతో, ఆమె నిలువ నీడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. వృద్ధాప్యంలో తలదాచుకోవడానికి చోటు లేక ఆమె పడుతున్న అవస్థల గురించిన విషయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి వచ్చింది.

పకృతి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధితురాలి పరిస్థితిపై తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి, మానవతా దృక్పథంతో ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. బాధితురాలికి తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆమెకు ప్రకృతి వైపరీత్యాల కింద ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story