Suryapet: సూర్యాపేట కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్
Suryapet: సూర్యాపేటలో కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ.
Suryapet: సూర్యాపేట కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్
సూర్యాపేట: విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ముగ్గురు అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
బాధిత కుటుంబాల్లో వెలుగులు
చనిపోయిన ఉద్యోగుల వారసులకు అర్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ ఉద్యోగాల ద్వారా భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఉద్యోగ అవకాశం కల్పించినందుకు లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




