Uttam Kumar Reddy: రైతుల పేరుతో బీఆర్‌ఎస్ డ్రామాలు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 May 2026 7:56 AM IST
Uttam Kumar Reddy
X

Uttam Kumar Reddy: రైతుల పేరుతో బీఆర్‌ఎస్ డ్రామాలు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ ఫైర్!

Uttam Kumar Reddy: రైతుల పేరుతో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆడుతున్న డ్రామాలు పరాకాష్ఠకు చేరాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ చేసిన ప్రకటనలను ఆయన కొట్టిపారేశారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతులను, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినవారే.. ఇప్పుడు అకస్మాత్తుగా రైతులపై ప్రేమ ఒలకబోయడం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకోకుండా శవ రాజకీయాలు చేయడం బీఆర్‌ఎస్‌ నేతలకు పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story