Huzurnagar: చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

Huzurnagar: చింతలపాలెం మండలంలో రూ. 23 కోట్లతో మేళ్లచెరువు–చింతిర్యాల డబుల్ రోడ్డు పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేసి, నూతన భవనాలను ప్రారంభించారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 20 Aug 2026 6:45 PM IST
Huzurnagar
X

Huzurnagar: చింతలపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

హుజుర్నగర్: గురువారం రాష్ట్ర నీటి పారుదల మరియు ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చింతలపాలెం మండలంలోని అడ్లూరు R&R సెంటర్ లో రూ 23 కోట్లతో మేళ్లచెరువు నుండి చింతిర్యాల వరకు డబల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు అలాగే రేబల్లె లో రూ,, 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రూ,,10 లక్షలతో నిర్మించిన మహిళా శక్తి భవనానికి ప్రారంభోత్సవం చేశారు.

తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గం లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని ప్రతి మారుమూల పంచాయతీలకు, తండాలకు నూతన రోడ్లు వేయడం జరుగుతుందని అలాగే గ్రామపంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామపంచాయతీ భవనాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి ప్రభుత్వం అనేక వడ్డీలేని రుణాలు మంజూరు చేసిందని వాటి ద్వారా ఏవైనా షాపులు లేదా డైరీలు పెట్టుకొని తమ ఉత్పత్తులు పెంచుకొని ఆదాయం పొందాలని అలాగే మహిళా శక్తి భవనాలలో మహిళా గ్రూపులకు సంబంధించిన సమావేశాలను నిర్వహించుకోవాలని మంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, డి ఆర్ డి ఓ పి డి సన్యాసయ్య, ఆర్డీవో శ్రీనివాసులు అడ్లూరు గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి, రేబల్లె గ్రామ సర్పంచ్ మాధవి, అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

Next Story