Nalgonda: నూతన రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి లబ్ధి మంత్రి ఉత్తమ్!

Nalgonda: నూతన రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 9:57 AM IST
Nalgonda
X

Nalgonda: నూతన రేషన్ కార్డులతో 3.42 కోట్ల మందికి లబ్ధి మంత్రి ఉత్తమ్!

Nalgonda: నల్లగొండ జిల్లా నూతన రేషన్ కార్డుల జారీ ద్వారా రాష్ట్రంలో 3.42 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14,950 కోట్లను వెచ్చిస్తోందని పేర్కొన్నారు.

రేషన్ పంపిణీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం సింహభాగం నిధులను కేటాయించి సన్నబియ్యాన్ని అందిస్తోందని, కేంద్ర ప్రభుత్వం కేవలం దొడ్డు బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కారణంగానే నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో చేపడుతోందని వివరించారు.

​రేషన్ షాపుల వద్ద ప్రధాని, ముఖ్యమంత్రి ఫొటోలను ఏర్పాటు చేస్తూ పూర్తిస్థాయి ప్రోటోకాల్‌ను పాటిస్తున్నామని మంత్రి తెలిపారు. పేదల కడుపు నింపే రేషన్ కార్డుల వ్యవహారంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story