Suryapet: గరిడేపల్లిలో బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

Suryapet: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో రూ.12 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు బీటీ రోడ్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 3 July 2026 7:13 PM IST
Suryapet
X

Suryapet: గరిడేపల్లిలో బీటీ రోడ్లను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్

Suryapet: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో వివిధ గ్రామాలను కలుపుతూ వేసిన పంచాయతీ రాజ్ రోడ్లకు జిల్లా ఎస్ పి కే నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలసి రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.

శుక్రవారం గరిడేపల్లి మండలంలో కల్మలచెర్వు లో రూ .4.20 కోట్లతో కల్మలచెర్వు నుండి పాలకవీడు సబ్ స్టేషన్ వరకు BT రోడ్డు ప్రారంభోత్సవం, రూ . 2.80 కోట్లతో కల్మలచెర్వు నుండి గానుగబండ వరకు BT రోడ్డు ప్రారంభోత్సవం, సొమ్లా తండ లో రూ. 84 లక్షలతో హనుమంతుల గూడెం PWD రోడ్డు నుండి సొమ్లా తండ వరకు BT రోడ్డు ప్రారంభోత్సవం,

గానుగబండలో రూ. 3.50 కోట్లతో గానుగబండ నుండి హనుమంతుల గూడెం వరకు BT రోడ్డు ప్రారంభోత్సవం, రూ. 1.40 కోట్లతో గానుగబండ హై స్కూల్ నుండి పర్రెడ్డిగూడెం వరకు BT రోడ్డు ప్రారంభోత్సవం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలను కలుపుతూ తారు రోడ్లు వేయించడం జరుగుతుందని,

గ్రామాలలో కొత్తగా వేసిన తారు రోడ్లపై వ్యవసాయ పనులు నిమిత్తం ట్రాక్టర్లకు బిగించిన ఫుల్ వీల్స్, ఆఫ్ వీల్స్ తిప్పరాదని, ఇలా తిప్పడం వలన రోడ్లు తొందరగా పాడైపోతాయని కావున గ్రామ ప్రజలు రోడ్లను కలకాలం ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. అలాగే ఈ సంవత్సరం ఏలీనీనో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు సూచించినందున,

రైతులు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని వ్యవసాయ శాఖ వారు సూచించిన సూచనలు పాటించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, గరిడేపల్లి ఇంచార్జ్ తాసిల్దార్ ఎన్ స్రవంతి, సర్పంచులు గూగుల్లోత్ లకృతి నాయక్, కడియాల పద్మ, కందుల మంగమ్మ,, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story