Nalgonda: కృష్ణమ్మ ఒడ్డున వరుణ యాగం పూజలు చేసిన మంత్రి ఉత్తమ్‌ దంపతులు

Nalgonda: నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరాన వరుణ యాగాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దంపతులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

Saleem, Nalgonda
Published on: 10 Aug 2026 7:00 AM IST
Nalgonda
X

Nalgonda: కృష్ణమ్మ ఒడ్డున వరుణ యాగం పూజలు చేసిన మంత్రి ఉత్తమ్‌ దంపతులు

Nalgonda: ​నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద కృష్ణా నది తీరాన వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

​ముందుగా వేద పండితులు, రుత్వికుల మంత్రోచ్ఛారణల మధ్య గోపూజ, విశ్వక్సేన పూజలు నిర్వహించి యాగశాల ప్రవేశం గావించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు నిండాలని కాంక్షిస్తూ ఈ పూజా కార్యక్రమాలను చేపట్టారు.

​ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో భవానీ శంకర్, డిప్యూటీ ఈవోతో పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story