Miryalaguda: మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. కాంగ్రెస్ పాలనలో సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక వ్యాఖ్యలు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 28 Sept 2026 3:01 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Miryalaguda: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి ఆరు లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేసాము ఇంకా ఇచ్చే కార్యక్రమం చేస్తూనే ఉంటాం. మూడు కోట్ల 40 లక్షల మంది కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. దేశంలో బీజేపీ ఓటు చోరీ విషయం లో రాహుల్ గాంధీ బీజేపీ పై పోరాడుతున్న విషయంలో మనం అభినందించాలి.

మనమందరం కలిసి రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి. రాబోయే రోజుల్లో మన దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతారని ఆశిస్తున్నాం.

గత brs ప్రభుత్వంలో నిరుపేదలకి ధోడ్డు బియ్యం ఇచ్చేవాళ్లు కానీ మన ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తున్నాం. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గడిచిన ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టులో నీరు ఉన్నాయా లేవు అని గమనించకుండా నీళ్లు వదలడం లేదంటూ అప్పుడు ప్రజారాలు చేస్తున్న టిఆర్ఎస్ నాయకుల

గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టినప్పటికీ మిర్యాలగూడలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరికి భయపడకుండా ఎదురు నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. గత విఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ 30,40 వేల మెజారిటీ మైనస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 వేల మెజార్టీ ఇచ్చి పార్టీని అధికారం తీసుకొచ్చిన కార్యకర్తలు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మీలాంటి కార్యకర్తలు కృషి వల్లనే ప్రభుత్వాన్ని ఏర్పరచుకోగలిము. మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇవాళ 2990590 రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. గత బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాగార్జునసాగర్ మిర్యాలగూడ నియోజకవర్గాలలో 878 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్లు ఆరు శంకుస్థాపనలు మాత్రమే చేశారు.

మీ మార్చిన తర్వాత 175 కోట్ల రూపాయలు ఇచ్చి నాగార్జునసాగర్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేస్తామని మాటిస్తున్నాము. మిర్యాలగూడలో నూతన బస్టాండ్ కి నా వంతు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA