Miryalaguda: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత, నలుగురు నిందితుల అరెస్ట్

Miryalaguda: మిర్యాలగూడ మండలం అవంతిపురం శివారులోని రైస్ మిల్‌లో పోలీసులు తనిఖీలు చేసి 21 టన్నుల అక్రమ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 27 Aug 2026 10:08 PM IST
Miryalaguda
X

Miryalaguda: అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత, నలుగురు నిందితుల అరెస్ట్

మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం అవంతిపురం శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్‌లో పోలీసుల తనిఖీలో బైటపడి అక్రమ PDS బియ్యం పట్టివేత.

రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 420 సంచుల్లో ఉన్న 21 టన్నుల PDS బియ్యం స్వాధీనం. PDS బియ్యాన్ని పాలిష్ చేసి ఇతర బస్తాల్లో ప్యాక్ చేస్తున్నట్లు గుర్తింపు. బియ్యం అక్రమ రవాణాకు ఉపయోగించిన ఐషర్ మినీ డీసీఎం వాహనం సీజ్

అక్రమ PDS బియ్యం వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులు A-1 సోమ రామకృష్ణ, A-2 చిమ్మట వెంకన్న A-3 చిమ్మట లోకేష్, A-4 సయ్యద్ నదీమ్ అరెస్ట్ రేషన్ కార్డుదారుల నుంచి తక్కువ ధరకు PDS బియ్యం కొనుగోలు చేసినట్లు పోలీసుల గుర్తింపు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story