Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సందడి చేసిన ఆసుపత్రి సిబ్బంది, మహిళలు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 17 Oct 2026 6:37 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు!

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవం, ప్రకృతితో మానవ సంబంధాలను చాటిచెప్పే బతుకమ్మ పండుగ విశిష్టతను గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, వేడుకల్లో పాల్గొన్న వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA