Miryalaguda: స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాలని నిరసన

Miryalaguda: మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో ముద్రించాలని డిమాండ్.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 18 Aug 2026 10:44 PM IST
Miryalaguda
X

Miryalaguda: స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ ఫోటో ముద్రించాలని నిరసన

మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర సర్కార్ పనితీరు సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా మారిందని మిర్యాలగూడ బిజెపి మండిపడింది స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ముద్రించకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. నల్గొండ మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు మిర్యాలగూడ బిజెపి వన్ టౌన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇచ్చే 6 కిలోల రేషన్ బియ్యం వాటాలో ఐదు కేజీలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నప్పటికీ కనీస సోయి లేకుండా స్మార్ట్ రేషన్ కార్డు పై ప్రధాని మోదీ ఫోటోని ముద్రించడం లేదన్నారు.

సొమ్ము కేంద్రానిది అయితే సోకు రాష్ట్రానిధిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోని ముద్రించాలని లేనిపక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story