Miryalaguda: బియ్యం ధరలు తగ్గించి విక్రయించాలి కలెక్టర్ చంద్రశేఖర్

Miryalaguda: మిర్యాలగూడలో రైస్ మిల్లును కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఎల్ నినో నేపథ్యంలో బియ్యం ధరలు తగ్గించి విక్రయించాలని ఆదేశించారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 30 Oct 2026 11:15 PM IST
Miryalaguda
X

Miryalaguda: బియ్యం ధరలు తగ్గించి విక్రయించాలి కలెక్టర్ చంద్రశేఖర్

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కీలక సూచనలు చేశారు.ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించకుండా, ధరలు తగ్గించి విక్రయించాలని రైస్ మిల్లర్లను కోరారు.

మార్కెట్లో నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.శుక్రవారం మిర్యాలగూడ సమీపంలోని దాక్షాయిని పారాబాయిల్డ్ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బియ్యం మర ఆడించడం, ప్యాకింగ్, రవాణా తదితర ప్రక్రియలను పరిశీలించారు.

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు గౌరీ శ్రీనివాస్, కార్యదర్శి బాబి, మిల్ యజమానులు జేవీ రమణ, తిరుపతిరావులతో మాట్లాడిన కలెక్టర్.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బియ్యం ధరలను తగ్గించి విక్రయించాలని సూచించారు.

బియ్యం హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని కోరారు.అనంతరం బియ్యం బస్తాల బరువు, ఖాళీ బస్తాలు, లేబుళ్లు, ప్యాకింగ్ విధానం, ధరలను పరిశీలించారు.ఈ తనిఖీల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, డీఎస్ఓ వెంకటేష్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA