Miryalaguda: ఉత్తమ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఫైర్!
Miryalaguda: మిర్యాలగూడలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Miryalaguda: ఉత్తమ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఫైర్!
Miryalaguda: ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు మిర్యాలగూడ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశం. డీసీసీ జెనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ గారు మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు దేశిడి శేఖర్ రెడ్డి గార్లు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పౌరసరఫరాలు.. నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దుర్భాషలాడిన బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని సీనియర్ శాసనసభ్యునిగా. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మచ్చలేని నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే నేతగా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న నాయకుడన్న విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక గౌరవప్రదమైన మంత్రి హోదాలో ఉన్న ప్రజా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిగారి పై బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడిన తీరు తీవ్ర ఆక్షేపనీయం.
పరమ దుర్మార్గమైన రాజకీయాలు చేసేది ఎవరో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అపరిచితులా తీరుగా పైకి ఒకలా కనిపిస్తూ.. నటిస్తూ.. తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే అన్న విషయం అందరికీ తెలుసు. నిజాయితీగా నిబద్ధతతో.. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మెచ్చుకునే విధంగా పనిచేసే మచ్చలేని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎత్తే,
విమర్శించే అర్హత ఒంటెద్దు నరసింహారెడ్డికి లేదు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం.. తపన పడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల ప్రజలే తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ అందరి అభిమానాలు పొందారు.
అంతేగాక తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తపన పడుతున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం అందిస్తూ వారి కడుపు నింపుతున్నారు. అంతేగాక నీటిపారుదల శాఖ మంత్రిగా సాగునీటి ఇబ్బందులు లేకుండా రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో క్రియాశీలకంగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్ళుగా భావిస్తూ అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శించే ముందు ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాలి. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది ఎవరో అక్కడి ప్రజలు అడిగితే తెలుస్తుంది. అక్రమంగా సంపాదించింది ఎవరో.. నిర్బంధాలు చేసిందెవరో.. అక్రమంగా భూములు ఆక్రమించుకుంది ఎవరో.. హుజూర్ నగర్ ప్రజలందరికీ తెలుసు.
రాష్ట్ర మంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ మార్గదర్శిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అకారణంగా అసత్య ఆరోపణలు చేసి కించపరిచే విధంగా మాట్లాడిన ఒంటెద్దు నరసింహారెడ్డి పై న్యాయపరంగా చట్టపరంగా ముందుకు వెళ్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్, జావీద్ గారు, ఆవుట శ్రీనివాస్ గారు, మనోజ్ గారు, చక్రపాణి, బూడిద సైదులు గారు, మరియు కాంగ్రెస్ నాయకులు బంటు లక్ష్మీనారాయణ గారు, గొట్టిముక్కల లక్ష్మణ్ గారు, షేక్ అబ్దుల్లా గారు, మణికంఠ గారు, ఇంమ్రాన్ గారు , సోమగాని శ్రీనివాస్ గారు,




