Miryalaguda: మిర్యాలగూడ ఈఎస్ఐ ఆసుపత్రి రోడ్డుపాలైన దుస్థితి!

Miryalaguda: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఈఎస్ఐ ఆసుపత్రికి 18 నెలలుగా రూ.18 లక్షల అద్దె బకాయిలు పేరుకుపోవడంతో యజమాని తాళం వేశారు. 15 రోజులుగా బయటే వైద్యం అందిస్తున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 20 Nov 2026 3:38 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ ఈఎస్ఐ ఆసుపత్రి రోడ్డుపాలైన దుస్థితి!

Miryalaguda: అద్దె చెల్లించలేదని ఆసుపత్రి యజమాని తాళం వేస్తే... వైద్యం కోసం వచ్చే రోగులు ఎక్కడికి వెళ్లాలి? ఏకంగా రూ.18 లక్షల అద్దె బకాయిలు పేరుకుపోయే వరకు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? 15 రోజులుగా ఆసుపత్రి బయటే వైద్య సేవలు అందిస్తున్నా ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? యాంకర్ పార్ట్ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఈఎస్ఐ ఆసుపత్రి పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కొనసాగుతున్న ఈఎస్ఐ ఆసుపత్రికి గత 18 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో సుమారు రూ.18 లక్షల వరకు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. దీంతో భవన యజమాని ఆసుపత్రికి తాళం వేశారు. ఫలితంగా గత 15 రోజులుగా వైద్యులు ఆసుపత్రి బయటే రోగులకు వైద్య సేవలు అందించాల్సిన దుస్థితి నెలకొంది.

ఈ సమస్యపై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలుస్తోంది. సొంత భవనం నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA