Miryalaguda: కేటీఆర్ పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత - కాంగ్రెస్ రాస్తారోకో
Miryalaguda: మిర్యాలగూడలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టాయి.
Miryalaguda: కేటీఆర్ పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత - కాంగ్రెస్ రాస్తారోకో
మిర్యాలగూడ: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో స్థానిక బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేటీఆర్ రాకను నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు.
ప్రధాన రహదారి దిగ్బంధం: కాంగ్రెస్ శ్రేణులు మిర్యాలగూడ బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది.
Next Story




