Miryalaguda: బీఆర్ఎస్ రైతు మహాధర్నా ప్రాంగణంలో కమ్ముకున్న కారుమబ్బులు
Miryalaguda: మిర్యాలగూడలో కేటీఆర్ హాజరుకానున్న బీఆర్ఎస్ రైతు మహాధర్నా ప్రాంగణంలో ఈదురుగాలులు, వర్షపు ముప్పుతో వాతావరణం మారిపోయింది. శ్రేణులు సన్నాహకాల్లో నిమగ్నమయ్యాయి.
Miryalaguda: బీఆర్ఎస్ రైతు మహాధర్నా ప్రాంగణంలో కమ్ముకున్న కారుమబ్బులు
మిర్యాలగూడ: రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్ గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న రైతు మహాధర్నా సభా ప్రాంగణం ఆకాశంలో కారుమబ్బులు కమ్మి, ఈదురుగాలులు వీస్తుండటంతో వాతావరణం క్షణక్షణం మారుతోంది.
ఈదురుగాలుల ధాటికి ప్రాంగణంలో కట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కదిలిపోతుండగా, వాన ముప్పుతో గులాబీ శ్రేణులు, పాల్గొనడానికి వచ్చిన రైతులు కలవరపడుతున్నారు.
ఎప్పుడు వర్షం పడుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, వాతావరణ ప్రతికూలతలను అధిగమించి సభను విజయవంతం చేసేందుకు నిర్వాహకులు, కార్యకర్తలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Next Story




