Miryalaguda: మాడుగులపల్లి మండలం కుక్కడం వద్ద ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

Miryalaguda: నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 21 Jun 2026 12:25 PM IST
Miryalaguda
X

Miryalaguda: మాడుగులపల్లి మండలం కుక్కడం వద్ద ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

మాడుగులపల్లి: నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని డీసీఎం వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు 50 ఏళ్ల బిక్షంగా గుర్తించారు. మిర్యాలగూడ పట్టణంలోని గుత్తిరెడ్డికుంట ప్రాంతానికి చెందిన నివాసి అని సమాచారం.

ప్రమాద సమాచారం అందుకున్న మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story