Miryalaguda: ఎలినో కరువుపై రైతులను ఆదుకోవాలని టీడీపీ నేత డిమాండ్

Miryalaguda: మిర్యాలగూడలో టీడీపీ నేత పోగుల సైదులు గౌడ్ మాట్లాడుతూ ఎలినో ప్రభావంతో నష్టపోతున్న రైతులు, కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 30 Oct 2026 11:00 PM IST
Miryalaguda
X

Miryalaguda: ఎలినో కరువుపై రైతులను ఆదుకోవాలని టీడీపీ నేత డిమాండ్

మిర్యాలగూడ: ఎలినో ప్రభావం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని పోగుల సైదులు గౌడ్ డిమాండ్ చేశారు. కరువు మండలాలను పెంచడంతోపాటు రైతులను, రైతు కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సూచించారు.

యాసంగి పంటలు వేయొద్దని ప్రభుత్వం సూచిస్తే రైతులకు ఎకరాకు 20,000 చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు రైతుబంధు తో సంబంధం లేకుండా రైతులకు రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించాలని సైదులు గౌడ్ కోరారు.

కరువు పరిస్థితులపై చర్చించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి సమస్యను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేలా ముఖ్యమంత్రి చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు రైతులకు నష్టం జరగకుండా ముందు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం మాజీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA