Miryalaguda: కేటీఆర్ ఫ్లెక్సీల ధ్వంసం - ఉద్రిక్తంగా మారిన రాజకీయాలు
Miryalaguda: మిర్యాలగూడలో కేటీఆర్ పర్యటన ఫ్లెక్సీలను కాంగ్రెస్ శ్రేణులు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
Miryalaguda: కేటీఆర్ ఫ్లెక్సీల ధ్వంసం - ఉద్రిక్తంగా మారిన రాజకీయాలు
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు, 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ ప్లే కార్డులతో తీవ్ర నిరసన తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను ధ్వంసం చేస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ సభను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సభకు సరైన భద్రత కల్పించాల్సింది పోయి, అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story




