Miryalguda: ఖేలో ఇండియా గేమ్స్–2026 పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్!
Miryalguda: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్–2026 ప్రచార పోస్టర్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
Miryalguda: ఖేలో ఇండియా గేమ్స్–2026 పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్!
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా గేమ్స్–2026 కు సంబంధించిన ప్రచార పోస్టర్ను మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. క్రీడా రంగంలో యువతకు ప్రోత్సాహం అందించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకునే అవకాశాలు లభిస్తాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎం డి. అక్బర్ ఆలీ రామక్రిష్ణ బ్యాట్మింటన్ కోచ్, రవి బాక్సింగ్ కోచ్, యూనుస్ టైక్వాండో కోచ్,జానీ, పవన్ కళ్యాణ్ శ్రీధర్ జూడో కోచ్, తదితరులు పాల్గొన్నారు.




