Miryalaguda: మిర్యాలగూడ చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతం

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మిస్సింగ్ అయిన ఏడేళ్ల చిన్నారి ఆచూకీ లభించింది.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 5 May 2026 9:40 PM IST
Miryalaguda
X

Miryalaguda: మిర్యాలగూడ చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతం

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మిస్సింగ్ అయిన ఏడేళ్ల పాప ఆచూకీ లభించింది ఓ మహిళ వద్ద పది రోజులుగా సురక్షితంగా ఆశ్రయం పొందినట్లు పోలీసులు గుర్తించారు 30 టీములుగా ఏర్పడి పాప ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు

మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ తండాకు చెందిన దివ్య సంతోష్ లకు ఒక బాబు పాప ఉన్నారు సంతోష్ కొంతకాలం క్రితం మరణించగా ఆ వేదనతో తల్లి దివ్య మతిస్థిమితం కోల్పోయింది దివ్య తన తల్లి దుర్గ వద్దనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుంది కాగా గత నెల 25వ తేదీ నాడు దివ్య తన కూతురు లక్ష్మిని తీసుకొని బయటకు వెళ్లి వచ్చేటప్పుడు బిడ్డను ఎక్కడో వదిలేసి మరిచిపోయి తిరిగి ఇంటికి వచ్చింది అమ్మమ్మ దుర్గ ఎంత వెతికిన పాప ఆచూకీ తెలియకపోవడంతో.

పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పది రోజులుగా గాలింపు చేపట్టారు పాపను ఒక మహిళ చేరదీసి ఆశ్రమం కల్పించింది నేడు పోలీసులు పాప కోసం గాలిస్తున్నారన్న సమాచారం తో తీసుకొని ఆ మహిళ పాపను పోలీసులకు అప్పచెప్పింది పోలీసులు పాపను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు దీంతో మిస్సింగ్ కేసు చేదించినందుకు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు..

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story