Devarakonda: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు
Devarakonda: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై ఎమ్మెల్యే బాలు నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ సమీక్ష నిర్వహించారు. ఓటు నమోదు పారదర్శకంగా సాగాలన్నారు.
Devarakonda: అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం డీసీసీ అధ్యక్షుడు
దేవరకొండ: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని దేవరకొండ శాసనసభ్యులు నేనవత్ బాలు నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సూచించారు. మంగళవారం మండల పరిధిలోని పోలేపల్లి ఎక్స్ రోడ్ వద్ద గల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో ‘ఎస్‌ఐఆర్ (SIR) ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ’పై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చాలని, అదే సమయంలో అనర్హుల పేర్లను తొలగించాలని స్పష్టం చేశారు.
Next Story




