Chinthapally: కాంగ్రెస్ బీఎల్ఏల సదస్సు.. ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరు!

Chinthapally: కాంగ్రెస్ ముఖ్య నాయకులు, బీఎల్ఏల అవగాహన సదస్సులో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొని కీలక సూచనలు చేశారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 6 July 2026 5:40 PM IST
Chinthapally
X

Chinthapally: కాంగ్రెస్ బీఎల్ఏల సదస్సు.. ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరు!

చింతపల్లి: చింతపల్లిలో బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత దిశానిర్దేశం..!

ఎస్‌ఐఆర్ (SIR) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొని, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు సక్రమంగా ఉండేలా కృషి చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు సూచించారు. చింతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఎల్ఏలు (Booth Level Agents), కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఎల్ఓలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ ప్రతి బూత్‌లోని ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఓటరు పేరు కూడా అనవసరంగా తొలగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. "ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటర్ల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత" అని పేర్కొన్నారు.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ బూత్ పరిధిలో పార్టీ మద్దతుదారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, వారి ఓటరు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను నిర్మించి ప్రతి ఓటరును చైతన్యపరిస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రజల మద్దతుతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈసారి దేశంలో శ్రీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేంతవరకు బిఎల్ఎ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరింత బలంగా పనిచేయాలని సూచించారు.

అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా బూత్ స్థాయి నుంచే సంస్థాగతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటు విలువను ప్రజలకు వివరించి, ఓటరు జాబితా సక్రమంగా ఉండేలా బీఎల్ఏలు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీలు కొండూరు భవాని పవన్ కుమార్, రవి నాయక్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల గిరి, మాజీ అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, మాజీ జడ్పీటీసీలు జంగిటి నర్సింహా, మాస భాస్కర్, మాజీ ఎంపీటీసీ ఎరుకల వెంకటయ్య గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ కొర్ర రాంసింగ్ నాయక్, సర్పంచ్లు కసారపు శ్వేత శ్రీనివాస్, యాచారం యాదిగౌడ్ మరియు బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA

Next Story