Devarakonda: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం.. ఎమ్మెల్యే
Devarakonda: దేవరకొండలో చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం.
Devarakonda: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం.. ఎమ్మెల్యే
Devarakonda: చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు.
శుక్రవారం దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌తో కలిసి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు శ్రీ పున్న కైలాష్ నేత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సంఘ ప్రతినిధులకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. చేనేత వృత్తిపై ఆధారపడిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని, సొసైటీ ద్వారా అందుతున్న ప్రభుత్వ ఫలాలను అర్హులందరికీ చేరేలా చూడాలని సూచించారు.




