Miryalaguda: తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్
Miryalaguda: మిర్యాలగూడ మండలం తకెళ్లపాడు తండాలో నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి, లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
Miryalaguda: తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బీఎల్ఆర్
Miryalaguda: నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలం తకెళ్లపాడు తండాలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారు భూక్యా సుజాత నూతనంగా నిర్మించుకున్న ఇంటిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి.. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఎమ్మెల్యే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు పేదల సొంతింటి కల సాకారం.




